బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూరు మండలంలోని గోపాల్ నగర్ గ్రామ పంచాయతీలో పక్కా ఇల్లు, భూ స్వాములకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని సోమవారం గ్రామస్తులు తహశీల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపిడిఓ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గోపాల్ నగర్ పంచాయతీలో రి సర్వే చేసి అర్హులైన నిరుపేదలకు ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని కోరారు. వీరికి టీడీపీ మండల ఇంచార్జి దాసరి శ్రీనివాస్, సిపిఐ కార్యదర్శి సాలిగామ సంతోష్ మద్దతు పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ... మండలంలో అన్ని గ్రామాల్లో పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.