మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని లిఫ్ట్ నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateshwarlu)కు వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ చింతకుంట గ్రామానికి మంచినీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇల్లు పూర్తి స్థాయిలో పారదర్శకంగా కేటాయించడం జరుగుతుందని, అర్హులైన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇల్లు కేటాయించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మంచినీటి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే బూర్గంపాడు ఎంపీటీవోకి ఫోన్ చేసి చింతనగర్ గ్రామంలోని మంచినీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో నల్ల రమేష్, సాధన పల్లి రవి తదితరులు పాల్గొన్నారు.