calender_icon.png 26 March, 2025 | 11:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి..

23-03-2025 04:16:36 PM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు...

జుక్కల్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. ఆదివారం ఆయన జుక్కల్ మండలం బంగారుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అట్టహాసంగా ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల కార్యక్రమంతో పాటు పలు సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రాజీవ్ వికాస పథకం కింద ఆర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు.  ఆయన వెంట కాంగ్రెస్ మండల యూత్ ప్రెసిడెంట్ సతీష్ పటేల్, పిఎసిఎస్ చైర్మన్ శివానంద్, నాయకులు రాజు పటేల్, రమేష్ దేశాయి, దిలీప్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.