29-04-2025 12:22:19 AM
చేగుంట, ఏప్రిల్ 28 :చేగుంట మండలంలోని చందాయిపేట, పెద్దశివునూర్ గ్రామం లో ఇందిరమ్మ ఇండ్లను క్షేత్రస్థాయిలో చేగుంట ఎంపీఓ ప్రశాంత్ పరిశీలించారు. లబ్ధిదారుల జాబితా చూస్తూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎంపికైన వారి ఇండ్ల స్థలాలను, ఇండ్లను ఆయన పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణ, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు అన్నం ఆంజనేయులు, ముదాం నాగరాజు, తలారి మహేందర్, అప్పల శ్రీనివాస్, ఎర్ర సిద్ధరాములు, ఫీల్ అసిస్టెంట్ వెంకటేష్ పాల్గొన్నారు.