05-04-2025 01:14:06 AM
రాబోయే 7 రోజుల్లో పేదలకు రేషన్ కార్డులు మంజూరు
రోడ్డు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
పాలేరు నియోజకవర్గం పరిధిలో 950 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం, ఏప్రిల్ -4 ( విజయక్రాంతి ):-ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ రోడ్డు నిర్మాణ పనులను 10 రోజులలో ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం మంత్రి, నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో పర్యటించి ప్లాన్ నిధులు 3 కోట్లతో చేపట్టిన రాయగూడెం - తక్కెళ్లపాడు వయా కట్టుకాచారం రహదారి వరకు చేపట్టిన రోడ్డు అభివృద్ధి, పటిష్ట పరచు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నియోజక వర్గం పరిధిలో 950 కోట్ల పైగా రోడ్డు పనులు మంజూరు చేశామని అన్నారు. జంక్షన్ నుంచి కట్టుకాచారం వరకు 3 కోట్ల తో చేపట్టిన రోడ్డు పనులకు టెండర్లు పూర్తి చేశామని, రాబోయే 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రాబోయే వారం రోజుల్లో రేషన్ కార్డులను మంజూరు చేస్తామని అన్నారు. రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. శ్రీరామ నవమి తర్వాత బహు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం పెండీంగ్ పెట్టిన రైతు బంధు నిధులను చెల్లించామని అన్నారు. గత ప్రభు త్వం ఇచ్చిన పెట్టుబడి కంటే అధికంగా ఎకరానికి 12 వేల రూపాయలు రైతు భరోసా నిధులు అందిస్తున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో ధాన్యం పం డిస్తున్నారని అన్నారు. యాసంగి లో కూడా రైతులు పండించిన ధాన్యానికి బోనస్ చెల్లిస్తామని మంత్రి తెలిపారు.
యాసంగిలోనూ సన్న వడ్లకు బోనస్
యాసంగి పంట కొనుగోళ్ల సమయంలోనూ సన్న వడ్లకు 500 రూపాయల బోన స్ చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.శుక్రవారం మంత్రి, నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి ప్రారంభించా రు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు, యువత, రైతుల దీవెనలతో రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిందని అన్నారు. గత పాలకులు రాష్ట్రంపై అప్పుల భారం మోపినప్పటికి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 25 లక్షల 65 వేల మంది రైతులకు 20 వేల 671 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసామని, గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 8 వేల కోట్ల రైతుబంధు నిధులను చెల్లించామని అన్నారు.
మత్స్యకారులకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం
మత్స్యకారులకు అండగా ఇందిరమ్మ ప్ర భుత్వం పని చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.శుక్రవారం మంత్రి కూసుమంచి లోని తన క్యాంపు కార్యాలయంలో గిరిజన మత్స్యకారులకు వలలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మ త్స్యకారులకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, న్యూ ఢిల్లీ ఆర్థిక సహాయంతో, ఖమ్మం జిల్లా మత్స్యకార గిరిజనుల అభివృద్ధి కోసం పాలేరు మత్స్య పరిశోధన స్థానంలో 3 రోజుల శిక్షణ తో పాటు, వారి ఆర్థిక అభివృద్ధి, చేపల పట్టుబడి కోసం వలలు తదితర సామాగ్రి కలిపి ఒక్కొక్కరికి 8 వేల 500 రూపాయల విలువ చేసే సామాగ్రి చొప్పున 50 మంది గిరిజన మత్స్యకారులకు మంత్రి అందజేశారు.
అనంతరం కూసుమంచిలో 35 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ శాఖ రెవె న్యూ కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. సబ్ స్టేషన్ నిర్మాణంతో నిరంతర విద్యు త్ సరఫరా సబ్ స్టేషన్ నిర్మాణంతో నిరంతర విద్యుత్ సరఫరా బలోపేతం అవుతుందని పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నా రు. శుక్రవారం మంత్రి నేలకొండపల్లి మండ లం అనంతనగర్ లో 2 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్ర పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు, గృహ అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు నాణ్యమై న విద్యుత్ తో పాటు, ఎటువంటి కరెంట్ కోతలు లేకుండా ఉండేందుకు సబ్ స్టేషన్ లను మంజూరు చేసినట్లు అన్నారు. రాబో యే కొద్ది రోజుల్లోనే ఈ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ప్రారంభించుకుంటామని మంత్రి తెలిపారు.