06-03-2025 09:05:09 PM
పిట్లం (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమంలో భాగంగా, కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద నమూనా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పనులు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పిట్లం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అడ్వకేట్ రామ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు ముగ్గు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ రామ్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయబడుతుందని తెలిపారు. ప్రజలు నిరాశ చెందకుండా ఈ కార్యక్రమం ద్వారా తమ కలలను సాకారం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, పిట్లం పట్టణ అధ్యక్షుడు శివ, యువ నాయకుడు జంగం బాలు తదితరులు పాల్గొన్నారు.