10-03-2025 06:54:50 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని మల్లయ్యపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మాధన్మోహన్ రావ్ ఆదేశాల మేరకు పైలెట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నట్లు సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇండ్లు లేని పేదలందరికి ఇండ్లు కట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని అందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక కృషితో చోరువతీసుకొని మల్లాయపల్లి గ్రామంలో అర్హులందరికి పైలెట్ ప్రాజెక్టుగా ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారన్నారు.
ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామాలలోని అర్హులందరికి ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. నేడు ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గువేసి పనులు ప్రారంభించిన లబ్ధిదారులు ఎమ్మెల్యే మాధన్మోహన్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి మండల అధికార ప్రతినిధి గోపికృష్ణ, నాయకులు చింతల శంకర్, వెంకన్న, గ్రామ పంచాయితీ కార్యదర్శి రాజయ్య, హౌసింగ్ ఎ.ఇ.అశోక్, పలువురు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.