19-03-2025 12:19:37 AM
కలెక్టర్ ఎం హనుమంతరావు
యాదాద్రి భువనగిరి మార్చి 18 ( విజయకాంతి): ఇందిరమ్మ ఇండ్లకు సంబ దించిన లబ్ధిదారుల నిర్మాణాల పనుల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. మంగళవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు,యమ్ పి ఓ లతో ఇందిరమ్మ ఇండ్లు, త్రాగు నీరు, పన్ను వసూళ్లు, ఎల్‌అర్‌ఎస్, ల పై అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలసి మండలాల వారిగా సమీక్షించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లడుతూ ఎంపికైన ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ ను వేగవంతం గా పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి L-1,L-2,L-3 జాబితాలోని కుటుంబ వివరాలను పరిశీలించాలన్నారు. అర్హులైన నిరు పేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందించే విధంగా కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభు త్వం కల్పించిన ఎల్‌ఆర్‌ఎస్ ను సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన వారంద రూ గడువు లోగా తమ ప్లాట్లు రేగులరైజ్ చేసుకోవాలన్నారు.
ఈ నెల 31లోపు ఎల్‌ఆర్‌ఎస్ రాయితీని దరఖాస్తుదారులు విని యోగించుకొని లబ్ధి పొందాలని తెలిపారు. జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా గ్రామాలలో పరిశీలన చేయాలని సూచించారు.
అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని అన్నారు. చేతి పంపులు, బోరు బావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని,అవసరమైన చోట ముందస్తు మంచి నీటి బోర్ వేల్ ను, హైర్ బోర్ వేల్ ను ముందుగానే గుర్తించాలి. ముందు ముందు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగు ఏర్పాట్లు చేసుకోవాలి తెలిపారు.
టాక్స్ కలెక్షన్ ఖచ్చితంగా వసూల్ చేయాలి వసూల్ చేసిన టాక్స్ రికాన్సిలేషన్ చేసి బ్యాంకు లో జమ చేయాలి. లేనిచో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రెవిన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గ్రామాలలో ఎంపికైన ఇండ్లకు మార్కింగ్ ను వేగవంతం గా పూర్తి చేయాలని, ఎంపికైన గ్రామ పంచాయతి సెక్రెటరీలను ఆదేశించారు.
లబ్ధిదా రుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలన్నారు. మిగిలిన అన్ని గ్రామాలలోని సంబంధించిన ఇండ్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి నివేదిక సమర్పించాలని ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు, మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో జడ్పీ సీఈఓ శోభారాణి,రెవిన్యూ డివిజనల్ అధికారులు, కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి డి.ఆర్.డి.వో నాగిరెడ్డి , హౌసింగ్ పీడీ విజయసింగ్, హౌసింగ్ డిప్యూటీ ఈ ఈ లు టి. నాగేశ్వర రావు, ఎం. శ్రీ రాములు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.