calender_icon.png 7 April, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం

07-04-2025 04:48:35 PM

జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్..

కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల కోసం చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలోని మొదటి అంతస్తులో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గృహ నిర్మాణ  శాఖ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి, త్వరిత గతిన గ్రౌండింగ్ చేయాలని హౌసింగ్ అధికారులకు సూచించారు.  ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టి గడువు లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మి, హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకిలాల్, డి.ఈ శ్రీకాంత్, ఏఈ రాజలింగం తదితరులు పాల్గొన్నారు.