calender_icon.png 13 January, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇల్లు

13-01-2025 02:08:11 AM

5 లక్షల నిధులు.. నెల రోజుల్లోనే మాడల్ హౌజ్ పూర్తి

  1. కూసుమంచి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మాణం
  2. నేడు మంత్రి పొంగులేటి చేతుల మీదుగా ప్రారంభోత్సవం

ఖమ్మం, జనవరి 12 (విజయక్రాంతి): పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్రప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.5 లక్షల వ్యయంతో ఒక బెడ్ రూం, హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్‌రూం ఉండేలా ఇల్లు నిర్మించి లబ్ధిదారుకు అప్పగించనున్నది.

దీనిలో భాగంగా సర్కార్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధి కూసుమంచి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నెల రోజుల్లోనే రూ.5 లక్షలతో మాడల్ హౌజ్ నిర్మాణం పూర్తి చేసింది. నిధుల్లో రూ.1.80 లక్షలు సుతారీ, కూలీ ఖర్చులు, మిగతా నిధు లు ఇటుక, ఇసుక, ఐరన్, సిమెంట్, టైల్స్ తదితర సామగ్రికి వెచ్చించింది.

భోగి పండుగ సందర్భంగా సోమవారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాడల్ హౌజ్‌ను ప్రారంభించనున్నారు. తన సొంత నియోజకవర్గంలో తొలి మాడల్ హౌజ్ అందుబాటులో తెచ్చేందుకు మంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మాడల్ హౌజ్‌ను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు.