26-04-2025 07:23:36 PM
భైంసా (విజయక్రాంతి): ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీల ద్వారా పేద వర్గాలకు ఇందిరమ్మ ఇల్లు అందకుండా పోయే ప్రమాదం ఉందని ఈ కమిటీలను వెంటనే రద్దు చేయాలని బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించారు. శనివారం కుబీర్ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ఎంపీడీవో కార్యాలయంలో ధర్నా చేసి ఎంపీడీవో కు వినతిపత్రం అందించారు. కమిటీ సభ్యులు వారికి అనుకూలమైన వారికి ఇండ్లు ఇచ్చి పేదలకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు, దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.