calender_icon.png 28 December, 2024 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ కమిటీలను నిలిపివేయలేం

28-12-2024 03:32:12 AM

  1. సింగిల్ జడ్జి ఆదేశాలపై ఎలాంటి స్టే ఇవ్వలేం: హైకోర్టు
  2. జనవరి 24న తదుపరి విచారణ

* పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ, విచక్షణ ఉంటుంది. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే తప్ప సర్కార్ విధాన నిర్ణయాల విషయంలో ఆర్టికల్ 226 ప్రకారం న్యాయపరమైన సమీక్ష పరిమితం.

 హైకోర్టు

హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): గూడు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపికకోసం నియ మించిన ఇందిరమ్మ కమిటీలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది.

కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 24కు వాయిదా వేసింది. నిరుపేదలకు గృహవ సతి కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇ ందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేయాలని, తొలి దశలో 4,50,000 గృ హాలను నిర్మించాలని సంకల్పించింది.

ఈ నే పథ్యంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏ ర్పాటు చేస్తూ గృహనిర్మాణ శాఖ కార్యదర్శి 2024, అక్టోబర్ 11న జీవో జారీ చేశారు. ఈ కమిటీలను కలెక్టర్ ఎంపిక చేస్తారు. పంచాయతీల్లో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి చైర్మన్‌గా ఇద్దరు స్వయం సహాయక సంఘా ల మహిళలు సభ్యులుగా మరో ముగ్గురు (ఒక బీసీ, ఒక ఎస్సీ లేదా ఎస్టీ తప్పనిసరి) ఉంటారు.

మున్సిపల్ వార్డుల్లో కౌన్సిలర్ లే దా కార్పొరేటర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ జీవోను సవాల్‌చేస్తూ నిజామాబాద్ జి ల్లా వేల్పూర్ కొలిపాక మండలం కొత్తపల్లికి చెందిన ఆరె నితీశ్‌కుమార్‌తో పాటు మరొక రు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీ నిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ‘అర్హత ప్రమాణాల ప్రకారం లబ్ధిదారులను నిర్ధారిస్తారు.

పథకాలను అమలు చేయడానికి రా ష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ, విచక్షణ ఉంటుంది. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే తప్ప సర్కార్ విధాన నిర్ణయాల విషయంలో ఆర్టికల్ 226 ప్రకారం న్యాయపరమైన సమీక్ష పరిమితం’ అంటూ పిటిషన్‌ను కొట్టివేశారు. 

ద్వి సభ్య ధర్మాసనం వద్ద అప్పీల్..

సింగిల్ జడ్జి నవంబర్ 14న ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ నితీశ్‌కుమార్ అప్పీల్ దా ఖలు చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ శరత్ శుక్రవారం విచారణ చేపట్టారు. ఎలాంటి అర్హతలు పేర్కొనకుండా స భ్యుల ఎంపిక చట్టవిరుద్ధమని.. ఇష్టం వచ్చి నవారిని, రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలను సభ్యులుగా నియమించే ప్రమాదం ఉందని పిటిషనర్ న్యాయవాది పేర్కొన్నా రు.

ద్వి సభ్య ధర్మాసనం ముందు విచారణ ముగిసేవరకు ఇందిరమ్మ కమిటీలను నిల పాలని కోరారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషన్లు వేసే అర్హత వారికి లేదు. ఇళ్లు లేని వారి కోసం ఇందిరమ్మ పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవ ర్గానికి 3,500 ఇళ్లు నిర్మించనుంది. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పథకం అమలవుతోంది.

పథకాలను ఎలా అమలు చేయాలనే అధికారం ప్రభుత్వానికి ఉంటుం ది. అన్ని అంశాలను పరిశీలించాకే తీర్పు వె ల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ దశలో కమిటీలను నిలుపుదల చేయవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. కమిటీలను ఏర్పాటుపై స్టే ఇచ్చేందుకు తిరస్కరించింది. కౌంటర్ వేయాలని సర్కార్‌ను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది.