11-04-2025 01:21:04 AM
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వే గం పెంచేందుకు సర్కార్ చర్యలు చేపట్టిం ది. సొంత స్థలం ఉండి ఇల్లులేని పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చాలనే పట్టు దలతో ప్రభుత్వం ముందుకు సాగుతోం ది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4.5లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
అందులో భాగం గా తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 72వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మండలంలోని గ్రామాన్ని ఎం పిక చేసి ఇళ్లను మంజూరు చేసిన విష యం తెలిసిందే. రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి కావొచ్చింది. రెండో జాబితా ను త్వరలోనే విడుదల చేసేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికిగాను ప్రభుత్వం నాలుగు విడతలుగా నిధులు విడుదల చేయనుంది. తొలివిడతలో ఎంపిక చేసిన 72 వేలకుపైగా ఉన్న లబ్ధ్దిదారుల్లో ప్రస్తుతం 15వేల మంది వరకు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. వాటిలో ప్రస్తుతం 2 వేల మంది బేస్‌మెంట్ స్థాయి వరకు పనులు పూర్తిచేశారు. బేస్‌మెంట్ పూర్తి చేసిన లబ్ధ్దిదారులకు ఇచ్చే రూ.లక్ష చెక్కును సర్కార్ రెడీ చేస్తుంది. వారం, పది రోజుల్లో లబ్ధ్దిదారుడికి రూ.లక్ష చెక్కును ప్రభుత్వం అందజేయనుంది.
మహిళా సంఘాల ద్వారా రుణాలు..
ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షల వరకు సాయం అందజేయనున్నది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా లబ్ధిదా రులు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. ఇందిరమ్మ ఇళ్లు మం జూరైనా చేతిలో చిల్లిగవ్వ లేనివారు చాలామంది ఉన్నా రు. ఇంటి నిర్మాణం రూ.లక్షల ఖర్చుతో కూడుకున్న పనికావడం..ముందు పనులు చేస్తేగాని ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కావడం ఉండదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు ఎలా కట్టుకోవాలి అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఫలితంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఆశించిన పురోగతి కనిపించకపోవడంతో.. సర్కార్ మరో కీలకనిర్ణయం తీసుకున్నది. అందుకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధ్డిదారులకు మహిళా స్వయం సహాయసంఘాల నుంచి రూ.లక్ష వరకు రు ణం ఇప్పించేలా ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నది.
బేస్‌మెంట్‌ను పూర్తిచేయని వారికి ముందుగా మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష వరకు రుణం ఇప్పించి..బేస్‌మెంట్ స్థాయి పూర్తికాగానే ప్రభుత్వం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమచేయనుంది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మరింత వేగం పెరుగుతుందని సంబంధిత అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సొం త నియోజకవర్గమైన పాలేరులో కొందరు లబ్ధిదారులకు మహిళా స్వయం సహాయక సంఘాల నుంచి రూ.లక్ష వరకు రుణం ఇప్పించి పనులు మొదలుపెట్టారు.
ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఇంజినీర్ల నియామకం
గృహనిర్మాణ శాఖలో ఉన్న ఇంజినీర్ల కొరతను అధిగమించేందుకు..ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ప్రైవేట్ ఇంజినీర్లను నియమించడానికి సర్కార్ కసరత్తు చేస్తోంది. వివిధ శాఖ ల్లో పనిచేస్తున్న ఇంజినీర్లను తిరిగి గృహనిర్మాణ సంస్థకు రప్పించారు. గృహనిర్మాణ సంస్థలో 505మంది ఇంజినీర్ల అవసరం ఉండగా, ప్రస్తుతం 125మంది ఇంజినీర్లే ఉ న్నారు.
తొలుత ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 390మంది ఇంజినీర్లను నియమించుకునేందుకు మ్యాన్‌పవర్ సప్లయర్స్‌కు బాధ్యత అప్పగించింది. అందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం వరకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఇం దులో ఎంపికైనవారు అసిస్టెంట్ ఇంజినీర్ హోదాలో పనిచేయాల్సి ఉంటుంది. వీరికి ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ బాధ్యతను ప్రభుత్వం అప్పగించబోతుంది.
అయితే గతంలో గృహనిర్మాణ శాఖలో సరిపడా ఇంజినీర్లు ఉండే వారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టిన సొంత సిబ్బంది సరిపోకపోవడంతో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కొందరి సే వలు తీసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన త ర్వాత వీరిని అప్పటి ప్రభుత్వం తొలగించిం ది. ఆ తర్వాత గృహనిర్మాణ సంస్థకు పెద్దగా పనిలేకపోవడంతో..ఆ సిబ్బందిని రోడ్లు, భవనాల శాఖలో కలిపేశారు. ఇప్పుడు వారి ని తిరిగి సొంతశాఖకు తీసుకొస్తున్నారు.
పీఎంఏవై నిధులు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సాయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చే నిధులను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జమ చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రం చేసిన విజ్ఞప్తికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పట్టణాల్లో నిర్మించే ఇళ్లకు పీఎంఏవైజీ కింద రూ.1.50లక్షలు, గ్రామీ ణ ప్రాంతాల్లో ఇళ్లకు రూ.74వేలు కేంద్రం సాయం చేయనుంది. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం సాయం చేయడానికి ఒప్పుకోవడం తో కొంతమేర ఆర్థిక భారం తప్పుతుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.