calender_icon.png 22 January, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలి

22-01-2025 02:18:18 PM

మందమర్రి,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(Mahatma Gandhi National Employment Guarantee Scheme)లో పనిచేస్తున్న భూమిలేని నిరుపేద ఉపాధి కూలీలను గుర్తించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Athmiya Bharosa) అందజేయాలని బిఆర్ఎస్ మండల నాయకులు పొన్నారం గ్రామ  మాజీ వార్డు సభ్యులు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ప్రస్తుత సంవత్సరం ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పని చేసిన భూమిలేని నిరుపేద కూలీలకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12 అమలు చేస్తామని చెప్పడం సరైనది కాదని ప్రభుత్వ తీరుపై తీవ్రంగా  మండిపడ్డారు. రైతు రుణమాఫీ(Farmer Loan Waiver) అమలు చేసిన సంవత్సరం నుండే ఉపాధి కూలీల 20 రోజుల పని దినాలను పరిగణలోకి  తీసుకొని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం 2006 లో అమలు చేసి గ్రామాల్లో వలసలు నివారించి గ్రామాల్లోనే నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు జాబ్ కార్డులు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని గత కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఇచ్చిన జాబ్ కార్డులను పరిగణలోకి తీసుకొని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పత్జంను  అర్హులైన ఉపాధి కూలీలకు అమలు చేయాలని కోరారు. అంతే కాకుండా అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.లేకుంటే టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు.