calender_icon.png 4 January, 2025 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం

02-11-2024 02:10:19 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబరు 1 (విజయక్రాంతి): దేశానికి ఏకైక మహిళా ప్రధానిగా నిలవడంతో పాటు దేశాన్ని రెండు దశాబ్దాల పాటు పాలించి స్వావలంభన దిశగా నడిపించిన దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ కురాలు, సనత్‌నగర్ ఇన్‌చార్జ్ కోట నీలిమ అన్నారు.

ఇందిరాగాంధీ వర్థంతిని పురస్కరించుకుని గురువారం నెక్లెస్ రోడ్డు చౌరస్తా, మోండా మార్కెట్‌లోని ఆమె విగ్రహాల వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ పబ్లికేషన్ విభాగం అధ్యక్షుడు పవన్ ఖేరా పాల్గొన్నారు.