మాజీ ప్రధానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): నెహ్రూ వారసత్వాన్ని అందిపుచ్చు కున్న ఉక్కు మహిళ ఇందిరాగాంధీ దేశ ప్రజలకు ఎంతో మేలు చేశారని, ఎన్నో విప్లవాత్మక మార్పులు చేపట్టారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. మంగళవారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమెను నివాళి అర్పించారు.
ఇందిరాగాంధీ జయంతిని పురస్కరిం చుకొని నిర్వహించుకునే జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ శక్తికి మహిళలే ప్రతీకలని ఇందిరాగాంధీ చెప్పిన మాటల స్ఫూర్తితో నే తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యమిస్తోందని వెల్లడించారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటిని పేర్కొన్నారు. ఆమె జయంతి రోజునే ఇందిర మహిళా శక్తి భవనాలకు భూమిపూజ నిర్వహించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే దేశ చరిత్రలో తొలిసారి మహిళా సంఘాలతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.