సంగారెడ్డి (విజయక్రాంతి): అంతరించిపోతున్న పంటలను సాగు చేయడంతో పాటు చిరుధాన్యాలను కాపాడుతున్న పేద మహిళా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ వ్యవసాయ పురస్కారాలు ప్రధానం చేశారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవ సభలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అవార్డు ప్రధానం చేశారు. అంతరించిపోతున్న చిరుధాన్య పంటలైన కుర్ర, సజ్జ, జొన్న, సామతో పాటు ఇతర పంటలను కాపాడేందుకు కృషి చేస్తున్న మహిళా రైతులను వారు అభినందించారు.