25-01-2025 12:00:00 AM
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో త్రైమాసిక ఫలితాల్ని శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన రూ.2,450.1 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.2,986.3 కోట్ల లాభంతో పోలిస్తే 18 శాతం క్షీణత నమోదైనట్లు ఇండిగో తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
2024--25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇండిగో మొత్తం ఆదాయం రూ.20,062.3 కోట్ల నుంచి రూ.22,992.8 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఆక్యుపెన్సీ రేషియో 1.2 శాతం పెరిగి 86.9 శాతానికి చేరింది. మార్కెట్ వాటాలో ఇండిగో తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ మార్కెట్ వాటా 62.1 శాతంగా ఉండగా.. ఈ ఏడాది ఆ వాటాను 63.8 శాతానికి పెంచుకుంది.