calender_icon.png 24 February, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ నుంచి మదీనాకు ఇండిగో కొత్త సర్వీస్

21-02-2025 04:36:58 PM

వారంలో మూడు రోజులు సేవలు..

రాజేంద్రనగర్: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (GHIAL) శుక్రవారం ఇండిగో ఎయిర్‌లైన్స్‌(Indigo Airlines)తో కలిసి శంషాబాద్ నుంచి మదీనాకు కొత్త విమాన సేవలను ప్రారంభించింది. తొలి విమానం ఆనందోత్సాహాల మధ్య GHIAL సీనియర్ అధికారుల సమక్షంలో బయలుదేరింది. ఈ సేవలు ప్రతివారంలో సోమవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటుంది. ప్రయాణ సమయం సుమారు 5 గంటలు 47 నిమిషాలు. ఈ కొత్త సేవతో అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది.

నిర్దేశిత విమాన వివరాలు:

హైదరాబాద్ నుండి మదీనాకు – ఫ్లైట్ No. 6E 57

సేవా రోజులు ప్రస్థానం (స్థానిక సమయం) ఆగమనం (స్థానిక సమయం)

సోమవారం / గురువారం / శనివారం 19:35 IST 23:45 AST

మదీనా నుండి హైదరాబాద్ కి – ఫ్లైట్ No. 6E 57

సేవా రోజులు ప్రస్థానం (స్థానిక సమయం) ఆగమనం (స్థానిక సమయం)

సోమవారం / గురువారం / శనివారం 00:45 AST  08:10. 

ఈ సందర్భంగా జీఎంఆర్(GMR) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (GHIAL) సీఈఓ ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ.. "మదీనాకు ఇండిగో తొలి విమానాన్ని స్వాగతించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కొత్త మార్గం మా అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను విస్తరించడమే కాకుండా, హైదరాబాద్ ను ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక నగరాలలో ఒకటైన మదీనాతో అనుసంధానించే ప్రత్యేక ప్రయాణ అనుభవాన్ని ప్రయాణీకులకు అందిస్తుందన్నారు.

అంతర్జాతీయ కనెక్టివిటీని మెరుగుపరచడం, ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల విస్తరణకు మద్దతు ఇవ్వడం, మా విలువైన ప్రయాణికులకు సులభమైన ప్రయాణ ఎంపికలను అందిస్తున్నట్లు వివరించారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియాలోని ప్రయాణికులకు ఇప్పుడు హైదరాబాద్లో అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ హబ్ ద్వారా మరిన్ని ప్రయాణ ఎంపికలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఇండిగో సిబ్బంది తదితరులు ఉన్నారు.