రాజేంద్రనగర్, జనవరి4: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేశారు. ఫ్లుటైలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఏటీసీ అనుమతి తీసుకొని ల్యాండ్ చేశారు. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండి గో విమానంలో శనివారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఈవిషయాన్ని వెంటనే గుర్తించిన పైలెట్ ఏటీసీకి విషయం తెలియజేశారు.
ఏటీసీ అనుమతితో శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్లుటైను సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇటీవల వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యం లో ఫ్లుటైలో ఉన్న 144 మంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సురక్షితంగా ల్యాండ్ చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.