calender_icon.png 15 October, 2024 | 1:57 AM

దేశీయ ఎయిర్ ట్రాఫిక్‌లో ఇండిగో ఆధిపత్యం

20-08-2024 12:30:00 AM

న్యూఢిల్లీ: భారత విమానయాన సంస్థ ల్లో 2024, జులైలో 1.29 కోట్ల మంది ప్రయాణీకులు ప్రయాణించారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.30శాతం ఎక్కువ అని సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది. అయితే, ఈ ఏడాది జూన్‌లో దేశీయ విమానయాన సంస్థలు తీసుకెళ్లిన 1.32 కోట్ల మందితో పోలిస్తే జులైలో విమానాల్లో రద్దీ తక్కువగా ఉంది. ప్రముఖ విమానయాన సంస్థ ’ఇండిగో’ దేశీయ ఎయిర్ ట్రాఫిక్‌లో తనఆధిపత్యాన్ని కొనసాగించింది.

జులైలో దాని మార్కెట్ వాటా 62 శాతానికి పెరిగింది. ఎయిర్ ఇండియా వాటా 14.30 శాతానికి పడిపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విడుదల చేసిన డేటా ప్రకారం, జులై నెలలో ’విస్తారా’కు సంబంధించిన దేశీయ మార్కెట్ వాటా 10 శాతానికి చేరుకుంది.ఏఐఎక్స్‌కనెక్ట్, ,స్పైస్‌జెట్‌ల్ల వాటా 4.50 శాతం, 3.10 శాతం వరకు మాత్రమే ఉంది. అలాగే, ఆకాసా ఎయిర్, అలయన్స్ ఎయిర్‌ల వాటా 4.70, 0.90 శాతం నమోదైంది.