న్యూఢిల్లీ: ప్రముఖ భారత విమానయాన సంస్థ ఇండిగో సోమవారం ఒక ప్రత్యేకమైన ‘గెట్-అవే సేల్’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. 2025 జనవరి 23 నుంచి ఏప్రిల్ 30 కాలవ్యవధిలో విమాన ప్రయాణాలు చేసే దేశీయ, అంతర్జాతీయ రూట్లలో రాయితీ ధరలను అందిస్తోంది. రూ.1,199 నుంచి దేశీయ ప్రయాణాలకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. రూ.4,499 నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
అయితే, ఈ ప్రయాణాలకు టిక్కెట్ల సేల్ ఈ డిసెంబర్ 25తో ముగుస్తుంది. తగ్గింపు ధరలతో పాటు, ఎంపిక చేసిన 6ఈ యాడ్-ఆన్‌లపై ఇండిగో గరిష్ఠంగా 15% డిస్కౌం ట్ను అందిస్తోంది. ఇందులో ప్రీపెయిడ్ అదనపు బ్యాగే జీ ఎంపికలు(15కేజీ, 20కేజీ, 30కేజీ), ప్రామాణిక సీట్ ఎంపిక, ఎమర్జెన్సీ ఎక్స్‌ఎల్ సీట్లు ఉన్నాయి. ఈ యాడ్-ఆన్‌లు దేశీయం గా రూ.599, అంతర్జాతీయ విమానాలకు రూ.699 నుంచి ప్రారంభమవుతు న్నాయి.
ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగదారులు అదనపు తగ్గింపులను పొందుతారు. ఈ డిసెంబర్ 31లోపు బుకింగ్ చేసే దేశీయ ప్రయాణ టిక్కెట్లపై 15శాతం, అంతర్జాతీయ ప్రయాణ టిక్కెట్లపై 10శాతంఫ్లాట్ డిస్కౌంట్లను పొందొచ్చు. టిక్కెట్ బుక్ చేసుకోడానికి కస్టమర్లు ఇండి గో వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని ఎయిర్‌లైన్ తెలిపింది.