పారిశ్రామిక విత్తనోత్పత్తి నుంచి స్వదేశీ బహిరంగ పరాగ సంపర్క విత్తన రకాలపై దృష్టి సారించాలి. దేశీయ విత్తనాలను గుణించడం, మార్కెట్ చేయడం కోసం రైతులతో కలిసి పనిచేసే ప్రైవేట్ కంపెనీలకు కూడా పన్ను ప్రయోజనాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అప్పుడే రైతులకు, దేశానికి ఆశించిన మేలు జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయాని కి రూ.2,481 కోట్ల కేటాయింపులతో మోదీ ప్రభుత్వం జీవావరణ శాస్త్రానికి పెద్దపీట వేసింది.
అయితే, ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, సేంద్రీయ బహిరంగ పరాగ సంపర్క విత్తనాల ఉత్పత్తి, సకాలంలో వాటి లభ్యత కోసం ఒక యంత్రాంగం లేకుండా ఈ వ్యవసాయ విప్లవం ఎలా సాధ్యమవుతుంది?
ప్రస్తుత విత్తన ఆర్థిక వ్యవస్థలో, రైతులు మార్కెట్-లో కొనుగోలు చేసిన విత్తనాలనే సాధారణంగా ఉప యోగిస్తారు. అవి హైబ్రీడ్ లేదా విత్తన కంపెనీలు లేదా ప్రభుత్వ వ్యవసాయ సంస్థలతో అభివృద్ధి చేసిన పరిశోధన విత్తనాలు, ఉత్తమంగా రెండు లేదా మూడు వరుస విత్తనాల కోసం వారు ఉపయోగించే వీలుంటుంది. కంపెనీలు బహిరంగ పరాగ సంపర్క వంగడాలను విక్రయించడం ప్రారంభిస్తే అతి త్వరలో రైతులు ఎవరూ తమ విత్తనాలను కొనుగోలు చేయవలసిన పనుండదు.
ఈ సహజ విత్తనాల ఉత్పత్తి నమూనా ప్రైవేట్ వ్యాపారానికి వ్యతిరేకం. సేంద్రీయ విత్తనాల ఉత్పత్తికి చెందిన మౌలిక సదుపాయాలు భారతదేశం లో లేవు. శాస్త్రీయ పరిశోధనలు లేదా సహజ పద్ధతుల నుండి ఉత్పత్తి అయిన విత్తనాల ప్రచారానికి ఎటువం టి ప్రయత్నాలు జరగడం లేదు. ఆ మేరకు కావలసిన వనరులను ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదు.
అడ్డంకులను తొలగించుకోవాలి
భారతదేశం ఒకనాడు లక్షలాది రకాల వరి విత్తనాలు/వరిని కలిగి ఉండేది. నేడు వాటిలో 5 శాతం కూడా భారతదేశంలో వాణిజ్యపరంగా సాగు చేయడం లేదు. జన్యు వైవిధ్యానికి వచ్చినప్పుడు ఇదే లోతైన అడ్డంకిగా ఉంది. 1121 వంటి చాలా వాణిజ్య రకాలు వ్యవసాయ యోగ్యమైన భూమిని కలిగిఉన్నాయి. కూరగాయలు, చిక్కుళ్ళు మొదలైన అనేక దేశీయ వంగడాలు శాశ్వతంగా లేదా అంతరించిపోయే దశలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రైతుల కోసం ఒక కొత్త స్వచ్ఛంద కార్యక్ర మం ప్రారంభమవాలి. స్థానిక విత్తన బ్యాంకులు ఏర్పడి రాష్ట్ర వ్యవసాయ సంస్థలకు అనుసంధానం కావాలి. రైతులకు విత్తనాలను పెంచడానికి, గుణించడానికి అనుగుణమైన భూప్రదేశాలనూ ఇవ్వవలసి వుంది. ఈ మేరకు వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందించాలి. నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఈ బాధ్యత ఇవ్వాల్సిందిగా రైతులు కోరుతున్నారు.
పారిశ్రామిక విత్తనోత్పత్తి నుండి స్వదేశీ బహిరంగ పరాగ సంపర్క విత్తన రకాలపై దృష్టి సారించడం అవసరం. దేశీయ విత్తనాలను గుణించడం, మార్కెట్ చేయ డం కోసం రైతులతో కలిసి పనిచేసే ప్రైవేట్ కంపెనీలకు కూడా పన్ను ప్రయోజనాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకోవైపు మారుతున్న వాతావరణం విత్తన ఉత్పత్తిదారులపై అదనపు ఒత్తిడిని కలిగిస్తున్నది. ఫలితంగా అంకురోత్పత్తి పడిపోవడం లేదా సరికాని పెరుగుదల ఏర్పడవచ్చు. మహారాష్ట్రలో సోయాబీన్ విత్తన వైఫల్యం ఇందుకు చక్కటి ఉదాహరణ.
చాలా వాణిజ్య మార్కెట్ వంగడాలు భారతదేశంలోని దక్షిణ ప్రాంతాలలో అభివృద్ధి అయ్యాయి. జిల్లా, ప్రాంతీయ స్థాయిలలో ఎవల్యూషనరీ పార్టిసిపేటరీ బ్రీడింగ్ నమూనాలను అవలంబించాలి. వాస్తవానికి, అన్ని జిల్లాలు విత్తన సార్వభౌమాధికారం కావాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇది స్థానిక విత్తన ఆర్థిక వ్యవస్థ ను పునరుజ్జీవింపజేస్తుంది. అదే సమయంలో సేంద్రీ య రైతులకు విత్తనాల కొనుగోలు ఖర్చులనూ తగ్గిస్తుంది. ఇది దీర్ఘకాలంలో యావద్దేశానికి కావలసిన విత్తన సార్వభౌమాధికారాన్ని కలిగించడమేకాక సహజ వ్యవసాయ విధానానికి మంచి పునాది వేస్తుంది.
గడీల ఛతప్రతి