calender_icon.png 23 December, 2024 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరికొత్త గరిష్ఠాలకు సూచీలు.. నిఫ్టీ @25,000+

02-08-2024 01:11:52 AM

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన సూచీలూ రాణించాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 82,129 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25,078 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకాయి. గరిష్ఠాల వద్ద అమ్మకాలతో సెన్సెక్స్ 82వేల దిగువకు చేరగా.. నిఫ్టీ మాత్రం తొలిసారి 25 వేల ఎగువన ముగియడం గమనార్హం. సెప్టెంబర్లో వడ్డీ రేట్లు తగ్గింపు ఉంటుందని అమెరికా ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లలో జోష్కు కారణమయ్యాయి.

సెన్సెక్స్ ఉదయం 81,949.68 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,741.34) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలోనే సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ 82వేల మార్కును దాటింది. ఇంట్రాడేలో 81,700.21- 82,129.49 మధ్య కదలాడిన సూచీ చివరికి 126 పాయింట్ల లాభపడి 81,867 వద్ద ముగిసింది. నిఫ్టీ 59.75 పాయింట్లు లాభపడి 25010 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.89గా ఉంది. సెన్సెక్స్లో పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, అదానీ పోరట్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 80.68 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ధర మరింత పెరిగి ఔన్సు 2,479 డాలర్ల స్థాయికి చేరింది.