calender_icon.png 3 March, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాభాల్లో ముగిసిన సూచీలు

30-01-2025 12:37:17 AM

23,100కు ఎగబాకిన నిఫ్టీ 

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదేబాటలో పయనించాయి. ఇన్ఫోసిస్, జొమా టో, టీసీఎస్ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీనికితోడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పన్ను మినహాయింపు ఉంటుందనే అంచనాలు పెరగడం తో సూచీలు రాణించాయి.

కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు దిగడం, ఐటీ, ఆటో స్టాక్స్‌లో  కొనుగోళ్లతో సూచీలు లాభాల బాటపట్టాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు మార్కెట్ల ర్యాలీకి ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో అక్కడి విధా న పరమైన నిర్ణయాల కోసం మదుపర్లు ఎదురుచూస్తున్నారు.

మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాల పర్వం కొనసాగుతున్నందుకు కాస్త అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. సెన్సె క్స్ ఉదయం 76,138.24 (క్రితం ముగింపు 75,901.41) వద్ద లాభాల్లో ప్రారంభమైంది.

రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 76,599.73 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 631 పాయింట్ల లాభంతో 76,532 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 205 పాయింట్ల లాభంతో 23,163 వద్ద ముగిసిం ది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.55 వద్ద స్థిరపడింది. 

సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76.73 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2,797.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది.