calender_icon.png 24 January, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు

24-01-2025 01:08:28 AM

* 23,200 ఎగువన నిఫ్టీ

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలుగురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం ఫాట్‌గా ప్రారం భమైన సూచీలు ఆటో, ఐటీ కంపెనీల షేర్ల మద్దతుతో రాణించాయి. అల్ట్రాటెక్ సిమెం ట్, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 115 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.

సెన్సెక్స్ ఉదయం 76,414.52 (క్రితం ముగింపు 76,404.99) వద్ద ఫ్లాట్‌గా ప్రా రంభమైంది. ప్రారంభంలోనే కాస్త ఒత్తిడికి లోనైన సూచీ ఇంట్రాడేలో 76,202.12 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఐటీ, ఆటో రంగ షేర్లలో మదుపర్లు కొనుగోళ్లకు దిగగా ఇంట్రాడేలో 76,743.54 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 115 పాయింట్లు లాభంతో 76,520.38 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 23,205.35 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, జొమాటో, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, హెచ్‌యూఎల్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 78.97డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2,755 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.47 వద్ద ముగిసింది.