12-03-2025 12:15:22 AM
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికాలో నెలకొన్న మాంద్యం భయాలతో సో మవారం ఆ దేశ స్టాక్ మార్కెట్లు కుదేలవ్వ గా.. నేడు ఆసియా స్టాక్ మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం పడింది. దేశీయ మార్కెట్ల పైనా ఆరంభంలో ఆ ప్రభావం కనిపించినప్పటికీ.. తర్వాత సూచీలు క్రమంగా కోలు కు న్నాయి. చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లలో విక్రయాలు సూచీలను పడేయగా.. ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్‌టెల్, రిలయన్స్ షేర్లు నిలబెట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఉదయం 73,743.88 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఉదయమంతా దాదాపు నష్టాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత స్వల్ప లాభాల్లో కి వచ్చిన సూచీ 74,195.17 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 12.85 పాయింట్ల నష్టంతో 74,102.32 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 37.60 పాయింట్ల నష్టంతో 22,497.90 వద్ద స్థిరపడింది.
డాలరుతో రూపాయి మార కం విలువ 9 పైసలు కోలుకుని 87.22గా ఉంది. సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మారు తీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 69 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2916 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు కుదేలు
ఇండస్‌ఇండ్ షేర్లు నేడు భారీగా కుం గాయి. ఏకంగా 27 శాతం మేర క్షీణించాయి. బ్యాంక్‌కు చెందిన డెరివేటివ్ పోర్ట్‌ఫోలియో లో అవకతవకలు ఉన్నట్లు అంతర్గత సమీక్షలో తేలడం ఇందుకు కారణం. దీంతో బ్యాంక్ నికర విలువపై దాదాపు 2.35 శాతం ప్రతికూల ప్రభావం పడనున్నట్లు బ్యాంక్ అంచనా వేసింది. అంటే ఏకంగా రూ.1,500 కోట్ల నష్టానికి సమానం.
ఈ ప్రకటన షేర్లపై ప్రతికూల ప్రభావం చూ పింది. ప్రస్తుత సీఈఓ సుమంత్ కత్పలియా పదవీకాలాన్ని మూడే ళ్లు కాకుండా ఒక సంవత్సరం పాటే పొడిగించేందుకు ఆర్బీఐ అనుమతించడంతో సోమవారం బీఎస్‌ఈ లో 3.86 శాతం నష్టంతో రూ.900.70 వద్ద ముగిశాయి. బ్యాంక్ నుం చి తాజా ప్రకటన వెలువడడంతో మంగళవారం మరో 27 శాతం క్షీణించి రూ.655.95కి చేరింది.