26-02-2025 12:05:00 AM
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలుమంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ ఉదయం ఫ్లాట్‌గాప్రారంభమైన సూచీలు ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో కాసేపు రాణించాయి. ఓ దశలో సెన్సెక్స్ 300 పాయింట్లు పైగా లాభపడింది. చివరకు సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంతో ముగిసింది.
సెన్సెక్స్ ఉదయం 74,440.30 వద్ద ఫ్లాట్‌గాప్రారంభమైంది. ఇంట్రాడేలో 74,785.08 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 147 పాయింట్ల లాభంతో 74,602 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ ఇంట్రాడేలో 22,625.30 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని, 22,513.90 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 5 పాయింట్లు నష్టంతో 22,547 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, జొమాటో, బజాజ్ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు లాభపడ్డాయి. సన్‌ఫార్మా, టెక్‌మహీంద్రా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, అల్ట్రా టెక్ సిమెంట్, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టపోయాయి.
మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు క్షీణించాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు 87.21 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.84 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2,955.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది