20-02-2025 12:46:54 AM
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ ఉద యం నష్టాలతో ట్రేడింగ్ మొదలుపెట్టిన సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. రోజంతా లాభ- నష్టాల మధ్య చలించిన సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సె క్స్ ఉదయం 75,787.27 (క్రితం ముగింపు 75,967) వద్ద నష్టంతో ట్రేడింగ్ మొదలుపెట్టింది.
ఇంట్రాడేలో 75,581 వద్ద కనిష్టాన్ని తాకిం ది. చివరకు 28 పాయింట్లు తగ్గి 75,939 వద్ద ముగిసింది. నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 22,932 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్ కా ర్పొరేషన్, సన్ఫార్మా, బజాజ్ఫిన్‌స ర్వ్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎంఅండ్‌ఎం, టెక్ మహీంద్రా షేర్లు నష్టపో యాయి.
జొమాటో, యాక్సి స్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యా రెల్ ధర 76.30 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2,962. 90 డాలర్ల వద్ద కొనసాగుతోంది. కొద్ది రోజులుగా వరుస నష్టాలు మా ర్కెట్లను కుదిపేస్తున్నాయి.