calender_icon.png 22 January, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ వాణిజ్యంపై ఆశాభావం

22-01-2025 02:12:17 AM

*ట్రంప్ హయాం పట్ల వాణిజ్యవేత్తల వ్యాఖ్యలు

న్యూఢిల్లీ,  జనవరి 21: డొనాల్డ్ ట్రంప్ హయాంలో యూఎస్‌తో భారత్ వాణిజ్య, ఆర్థిక సంబంధాల పట్ల దేశీయ పరిశ్రమ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. హెల్త్‌కేర్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్య అవకాశాలు ఉంటాయన్నారు. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తీసుకువస్తే భారత్ కూడా భాగమైన బ్రిక్స్ దేశాలపై 100 శాతం టారీఫ్‌లు విధించనున్నట్లు మరోసారి ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయింకా ట్రంప్ కోసం భారత్ తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలను వివ రిం చారు.

యూఎస్ ఉత్పత్తులు కోసం భార త మార్కెట్‌ను సులభతరం చేయడం, స్టార్‌లింక్‌ను, టెస్లాను ఆహ్వానించడం, అమెజాన్ పట్ల సానుకూలంగా వ్యవహరించడం, రక్షణ సం బంధాల్ని పటిష్టపర్చడం వంటి చర్యల్ని భారత్ తీసుకుంటున్నదని, అందుకు బదులుగా ట్రంప్ భారత్ ఏరోస్పేస్, డిఫెన్స్ ఉత్పత్తుల తయారీకి మద్దతు అందించాలని, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో భారత్‌కు స్థానం కలిగేలా ఓటు చేయాలని, భారత నిపుణులకు వీసా నిబంధనల్ని సడలించాలని గోయింకా కోరారు.

ట్రంప్ గత హయాం భారత్‌కు అధికమేలు కల్గించిందని, ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు బాగున్నాయని పీహెచ్‌డీసీసీఐ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎస్‌పీ శర్మ చెప్పారు. ఈ సంబంధాలు తదుపరి రోజుల్లో మరింత పటిష్టపడతాయని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.

కొత్త ట్రంప్ యంత్రాం గానికి హెల్త్‌కేర్ సెక్యూరిటీ, ఆఫర్డ్‌బిలిటీ కీలక ప్రాధాన్యతలని, అందుచేత ఈ విభాగాల్లో భారత్ యూఎస్‌కు పరస్పర సహకారానికి అవకాశం ఉన్నదని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలియన్స్ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తె లిపారు. ఫార్మా రీసెర్చ్, మాన్యుఫాక్చరింగ్, స ప్లు చైన్ విభాగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారానికి, భాగస్వామ్యానికి అవకాశాలున్నాయన్నారు. 

యూఎస్ టారీఫ్‌లు విధిస్తే, భారత్ అదేరీతిలో స్పందించాలి

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధిస్తే, భారత్ సైతం యూఎస్ దిగుమతులపై టారీఫ్‌లు వేయాలని వాణిజ్య నిపుణు లు సూచించారు. గతంలో అమెరికా భారత్ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై టారీఫ్‌లు పెంచినందున, భారత్ అందుకు ప్రతిగా యాపిల్స్ తదితర యూఎస్ దిగుమతులపై సుంకాలు విధించిన సంగతిని వారు గుర్తు చేశారు.

యూఎస్ చర్యలపై భారత్ గట్టిగా స్పందించాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ కోరారు. యూఎస్ యంత్రాంగం టారిఫ్‌ను పెంచితే భారత్ నుంచి ఎగుమతయ్యే ఆటోమొబైల్స్, టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు అధికమవుతాయన్నారు.