* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటుపై మూడీస్ అంచనా
న్యూఢిల్లీ: ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీ స్ భారత్ వృద్ధిరేటు అంచనాలను తగ్గించేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024- 25)లో వృద్ధిరేటు ఏడు శాతమేనని తేల్చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) వృద్ధిరేటు 8.2శాతంతో పోలిస్తే తగ్గుముఖం పడుతుందని వ్యాఖ్యానించింది. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక ధోరణుల నేపథ్యంలో వృద్ధిరేటు అంచనాలు తగ్గిస్తున్నట్లు మూడీస్ పేర్కొంది. అలాగే, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు కొనసాగుతుందని వెల్లడించింది.
2023-24తో పోలిస్తే తలసరి ఆదాయం 10,233 డాలర్లతో 11 శాతం పెరిగింది. ఇంతకు ముందు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7 నుంచి 6.4 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. 2023-24లో జీడీపీ 8.2 శాతంగా నిలిచింది.
అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వృద్ధిరేటు గణనీయంగా పతనమైంది. గత డిసెంబర్‌లో ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) సైతం భారత్ వృద్ధిరేట్ అంచనాలను సవరించింది. 2023- 24లో భారత్ వృద్ధిరేటు 6.5 శాతమేనని ఏడీబీ పేర్కొంది. పారిశ్రామిక వృద్ధి బలహీ నం, ప్రభుత్వ వ్యయం తగ్గింపు దీనికి కార ణం అని వెల్లడించింది. ఇండ్ల డిమాండ్‌పై కఠిన ద్రవ్య పరపతి విధానంతో 2025-26లో జీడీపీ 7.2 నుంచి ఏడు శాతానికి పరి మితం అవుతుందని తెలిపింది.