ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: భారత్ మొత్తం విదేశీ రుణం 2023 సంవత్సరం చివరినాటికి 31 బిలియన్ డాలర్ల మేర పెరిగి 647 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.54.83 లక్షల కోట్లు) చేరినట్లు ప్రపంచ బ్యాంక్ తాజా రిపోర్ట్ వెల్లడించింది. ఈ రుణాలకు భారత్ వడ్డీ చెల్లింపులు 22.54 బిలియన్ డాలర్లకు పెరిగాయన్నది.
2022లో చెల్లించిన వడ్డీలు 15.08 బిలియన్ డాలర్లు. దీర్ఘకాలిక రుణాలు 7 శాతం పెరిగి 498 బిలియన్ డాలర్లకు చేరగా, స్వల్పకాలిక రుణాలు మాత్రం స్వల్ప తగ్గుదలతో 126.32 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఇండియా విదేశీ రుణాలు ఎగుమతుల్లో 80 శాతంకాగా, వడ్డీ చెల్లింపులు ఎగుమతుల్లో 10 శాతమని రిపోర్ట్ వివరించింది.