అంతర్గాం తాహసిల్దార్ తూము రవీందర్...
రామగుండం (విజయక్రాంతి): భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే అని అంతర్గాం తాహసిల్దార్ తూము రవీందర్ పటేల్ కొనియాడారు. ఆమె జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో తాహసీల్డార్ తూము రవీందర్ పటేల్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సమ్మయ్య, సర్వేయర్ సురేష్, కృష్ణ, గిర్దవార్లు శ్రీమాన్, రమేష్, జూనియర్ అసిస్టెంట్లు పోచయ్య, సుమలత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.