కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండ ర్ టీ20 ప్రపంచకప్‌లో సోమవారం స్కాట్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఘన విజయాన్ని సాధించింది. మ్యాచ్‌లో భారత యువ జట్టు 119 పరుగుల తేడాతో భారీ గెలుపు అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
కమలిని (32) టాప్ స్కోరర్‌గా నిలవగా.. తెలుగు తేజం గొంగడి త్రిష (26), నికీ ప్రసాద్ (25) రాణించారు. అనంతరం స్కాట్లాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో 45 పరుగులకే కుప్పకూలింది. షబ్నమ్ షకీల్, వైష్ణవి, సోనమ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. శనివారం నుంచి మొదలుకానున్న టోర్నీలో భారత్ తొలి మ్యాచ్‌ను వెస్టిండీస్ తో ఆడనుంది. 2023లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి అండర్ టీ20 ప్రపం చకప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది.