calender_icon.png 29 October, 2024 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతీయుల మద్దతు కమలకే..

29-10-2024 12:54:55 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: నవంబర్ 5న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే నిర్వహించిన సర్వే ఫలితాల్లో భారతీయ అమెరికన్ల మద్దతు డెమోక్రాటిక్ అభ్యర్థి కమలాహారిస్‌కే ఉందనే విషయం వెల్లడైంది. ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే పేరుతో వెలువడిన ఫలితాల్లో 61శాతం మంది భారతీయ అమెరికన్లు కమ లా హారిస్‌కే మద్దతు తెలిపినట్లు వెల్లడైంది.

కేవలం 31 శాతం మంది మాత్రమే డొనాల్డ్ ట్రంప్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు సర్వే తేల్చింది. అయితే 2020 నాటి ఎన్నికలతో పోల్చితే ఈ సారి డెమోక్రాటిక్ అభ్యర్థికి ఇండియన్ అమెరికన్ల మద్దతు తగ్గిందని సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. గత ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిని సపోర్ట్ చేసిన భారతీయుల సంఖ్య 68 శాతం ఉండగా ఇప్పుడు 61 శాతానికే పరిమితమైందని వివరించింది.

ఇదే సమయంలో ట్రంప్‌కు మద్దతు తెలిపే భారతీయుల సంఖ్య 9శాతం పెరినట్లు చెప్పింది. ఈ సర్వే ను యాగవ్, కార్నేగి ఎండౌమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అనే సంస్థ లు సంయుక్తంగా నిర్వహించాయి.