కార్బన్ మోనాక్సైడ్ పీల్చడంతో మరణం?
టిబిలిసి, డిసెంబర్ 16: జార్జియా లోని కాకసస్ పర్వతాల్లోని స్కీయింగ్ రిసార్టులో తీవ్ర విషాదం నెలకొంది. రిసార్టు ప్రాంతమైన గూడౌరిలోని ఒక రెస్టారెంట్లో 12 మంది భారతీయులు చనిపోయారని అక్కడి ఇండియన్ మిషన్ ప్రకటించింది. బాధితులందరూ కార్బన్ మోనాక్సైడ్ విష పూరిత వాయువు పీల్చడంతో మరణించారని పోలీసులను ఉటంకిస్తూ స్థానిక మీడియా తెలిపింది. మృతులందరూ భారతీయులేనని పేర్కొన్న ది.
అంతకుముందు జార్జియా అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం మృతుల్లో 11 మంది విదేశీయులు, ఒకరు జార్జియా దేశస్తుడని తెలిపిం ది. రిసార్టులో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ లో మృతులంతా ఉద్యోగులని, వారి మృతదేహాలను రెండో అంతస్తులో ఉన్న బెడ్ రూంలో కనుగొన్నా మని వెల్లడించింది.
మృతుల వివరాలు తెలుసుకోవడానికి స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఇండియన్ మిషన్ ఒక ప్రకటనలో పేర్కొన్నది. శుక్రవారం రెస్టారెంట్‌లో కరెంట్ పోవ డంతో చమురుతో నడిచే జనరేట్ ఆన్ చేశారని అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే విషవాయులు వెలువడి వారంతా మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.