త్వరలో భారతీయులకు అవకాశం!
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు రష్యా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వీసా లేకుండానే తమ దేశ పర్యటనకు అనుమతి ఇచ్చే అంశంపై కొంతకాలంగా రష్యా చర్చలు జరుపుతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కీలకదశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2025 స్ప్రింగ్ సీజన్ నుంచి వీసా సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రష్యాకు చెందిన ఉన్నతాధికారి ధ్రువీకరించారు.
ఈ ఒప్పందానికి ఆమోదం లభిస్తే భారత్ నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు మాస్కో సిటీ టూరిజం కమిటీ చైర్మన్ ఎవ్జెనీ కోజ్లోవ్ వెల్లడించారు. గతేడాది ఆగస్టు 1 నుంచి భారత్ నుంచి రష్యా వెళ్లే ప్రయాణికుల కోసం రష్యా.. ఈ దరఖాస్తు చేసుకునే (నాలుగు రోజుల్లో జారీ అవుతుంది) వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా గతేడాది 9,500 మంది భారత పర్యాటకులకు ఈ జారీఅయ్యాయి.