ఎక్కడున్నా తెలుగువాళ్లందరూ ఒకటే
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): భారతీయులు కష్టజీవులు, తమ పని తాము చేసుకుని అభివృద్ధి చెందడంతో పాటు తమను ఆదరించిన దేశం అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అవుతారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. అందుకే భారతీయులంటే ప్రపంచ దేశాలవారికి ప్రేమ, అభిమానం ఎక్కువగా ఉంటుందన్నా రు. సిడ్నీలోని పార్లమెంటరీ కామన్వెల్త్ కార్యక్రమాలకు హాజరైన స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అస్టేయాలోని తెలంగాణ కమ్యూనిటీ ఆధ్వరంలో నిర్వహించిన ‘ మీట్ అండ్ గ్రీట్, దీపావళి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఉద్యోగ, వ్యాపార అవకాశాల కోసం ప్రజలు ప్రపం చం నలుమూలలకు వెళ్తున్నారని తెలిపారు.
మనం ఎక్కడికి వెళ్లినా భారతీయులమనేది గుండెల్లో ఉంటుందన్నారు. క్రికెట్‌ను ప్రేమించే భారతీయులు ఆస్ట్రేలియాతో క్రికె ట్ మ్యాచ్‌లు అంటే తెల్లావారుజామున 3 గంటలకు అలారం పెట్టుకుని నిద్రలేస్తారని పేర్కొన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, యువత కోసం స్కిల్ యూనివర్సిటీ, ఫోర్త్ సిటీ అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, మూసీ పునర్జీవనం, హైడ్రాతో చెరువుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామనని అన్నారు.