calender_icon.png 22 April, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ మేయర్‌తో ఇండియానా ప్రతినిధుల భేటీ

27-03-2025 12:00:00 AM

నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం 

మేయర్ గద్వాల విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26(విజయక్రాంతి) : గ్రేటర్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. అమెరికాకు చెందిన ఇండియానా ప్రతినిధులు ఆమెతో బుధవారం భేటీ అయ్యారు. ఇండియానా సేట్ తో 2010లో జీహెచ్‌ఎంసీ సిస్టర్‌సిటీ ఒప్పం దం చేసుకుంది. ఈ నేపథ్యంలో నగరానికి వచ్చిన ఆ ప్రతినిధి బృంధం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఛాంబర్‌లో ఆమెను కలిశారు. వారికి ఆమె ఆహ్వానం పలికారు. సిస్టర్ సిటీ ఒప్పందంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు, ఆ ప్రతినిధులు మేయర్‌కు తెలిపారు. హైదరాబాద్ గతం కంటే అభివృద్ధి చెందిని కొనియాడారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గ్రేటర్ పరిధిని పెంచి, హైదరాబాద్ చుట్టూ మరో ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్‌ను నిర్మించేందుకు సిద్ధంగా, ఉత్తరం వైపు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్ల వెడల్పు, ఫ్లు ఓవర్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో పాఠశాల విద్యాభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ప్రతినిధులను మేయర్ కోరగా వారు సానుకూలంగా స్పందించారు. ఇండియానా పోలీస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డియాగో మోరల్స్, చింతాల రాజు, చీఫ్ అడ్వైజర్ ఆఫ్ గ్రోత్ అండ్ స్ట్రాటజీ తదితరులు పాల్గొన్నారు.