మాజీ ప్రపంచ ఛాంపియన్ ను మట్టికరిపించిన భారత రెజ్లర్ అమన్
పారిస్ ఒలింపిక్స్: భారత్ రెజ్లర్ అమన్ సహ్రావత్ సెమీస్ కు చేరారు. క్వార్టర్ ఫైనల్లో జెలిమ్ ఖాన్ అబకరోవ్ పై అమన్ సహ్రావత్ విజయం సాధించారు. పురుషుల 57 కిలోల విభాగంలో అల్బేనియా రెజ్లర్ ఖాన్ పై 12-0 తేడాతో అమన్ అద్భుత విజయం సాధించారు. మాజీ ప్రపంచ ఛాంపియన్ పై భారత రెజ్లర్ అమన్ సహ్రావత్ గెలుపొందడంతో ఇండియన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌పై ఐవోఏ మూడేళ్ల నిషేధం విధించింది. ఒలింపిక్స్‌లో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు పంఘాల్‌పై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.