పారిస్ ఒలింపిక్స్ క్వార్టర్స్ కు భారత మహిళా ఆర్చరీ జట్టు చేరింది. మహిళల ర్యాంకింగ్ రౌండ్ లో మహిళా ఆర్చరీ జట్టు మంచి స్కోర్ చేయడంతో భారత్ నాలుగోస్థానానికి చేరింది. భారత మహిళా ఆర్చరీ జట్టులో అంకిత భకత్, దీపికా కుమారి, భజన్ కౌర్ కలిసి 1983 పాయింట్లు స్కోర్ సాధించారు. ఈ పారిస్ ఒలింపిక్స్ లో దక్షిణకొరియా 2046 పాయింట్లుతో 1వ స్థానంలో నిలువగా, చైనా 1996 పాయింట్లు సాధించి 2వ స్థానం, 3వ స్థానలో మెక్సికో 1986 పాయింట్లు సాధించింది. అంకిత భకత్ 666 పాయింట్లతో 11వ స్థానంలో నిలువగా, దీపికా కుమారి 658 పాయింట్లు సాధించి 22వ స్థానం, భజన్ కౌర్ 659 పాయింట్లు సాధించి 23వ స్థానంలో నిలిచారు. క్వార్టర్ ఫైనల్స్ లో ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్ తో జూలై 28వ తేదీన భారత్ పోటీ పడనుంది. ఇక క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ విజయం సాధిస్తే సెమీఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాతో పోటీ పడే అవకాశం ఉంటుంది.