calender_icon.png 22 November, 2024 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్ట్రేలియాను వణికించిన బుమ్రా, సిరాజ్

22-11-2024 03:42:47 PM

పెర్త్ టెస్టు: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2024లో టీమిండియా బౌలర్లు విజృంభిస్తున్నారు. బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. పెర్త్ వేదికగా జరుగుతున్న మ్యాచులో ఆట ముగిసే సమయానికి 67 పరుగులకే ఆసీస్ 7 ఏడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (03)ను భారత్ కెప్టెన్ బుమ్రా ఔట్ చేశాడు. బుమ్రా వేసిన 24.2 ఓవర్ కు వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా 59 పరుగుల వద్ద ఏడో వికెట్ చేజార్చుకుంది. ఆసీస్ బ్యాటర్లకు సిరాజ్ గట్టి షాక్ ఇచ్చాడు. క్రీజులో పాతుకుపోయిన కీలక బ్యాటర్ మార్నస్ లబుషేన్(02)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఈ ట్రోఫీలో జన్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ 2, వికెట్లు, రాణా ఒక వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. హైదరాబాద్ కుర్రాడు నితీశ్ రెడ్డి(41) టాప్ స్కోరర్, రిషబ్ పంత్ (37), కేఎల్ రాహుల్ (26) ఫర్యాలేదనిపించారు. అటు ఆసీస్ బౌలర్లలో హేజిల్ వుడ్ 4 వికెట్లు తీసి తీసుకున్నాడు.