calender_icon.png 23 January, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2040లో చంద్రునిపైకి ఇండియన్

20-09-2024 02:04:06 AM

  1. ఆ దిశగానే చంద్రయాన్-4 మిషన్
  2. గగన్‌యాన్, శుక్రయాన్‌పై ఏకకాలంలో దృష్టి
  3. సొంత అంతరిక్ష కేంద్రంపైనా కసరత్తు 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: అంతరిక్ష పరిశోధనలో భాగంగా భారత స్థానాన్ని పటిష్ఠం చేసే ందుకు ఇస్రో నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఈ మిషన్‌కు రూ.2,104 కోట్లు కేటాయించగా.. భవిష్యత్తులో మానవ సహిత చంద్రయాన్‌కు ఇస్రో సిద్ధమవుతోంది. 2040 నాటికి చంద్రునిపై వ్యోమగాములను దింపాలనే అంతిమ లక్ష్యానికి పునాది వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమ ంలో 2027లో ప్రయోగించనున్న చంద్రయాన్-4 చంద్రుని అన్వేషణలో కీలక మైలు రాయిగా నిలవనుంది. ఈ మిషన్‌లో కచ్చితత్వంతో కూడిన ల్యాండింగ్, నమూనా సేకరణ, తిరిగి భూమికి సురక్షితంగా చేరుకోవడం భాగం. ఈ మిషన్లకు అవసరమైన కీలక సాంకేతికతలను ప్రదర్శించడం ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం. చంద్రుని నుంచి మట్టి, రాళ్ల నమూనాలను తీసుకురాగలిగితే గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఇది భారత సామర్థ్యం ప్రపంచదేశాలకు తెలిసివస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

చంద్రునికిపైకి భారతీయుడు

చంద్రయాన్-4 మిషన్ రెండు వేర్వేరు ప్రయోగాలలో 5 మాడ్యూళ్లను కలిగి ఉంది. సంక్లిష్టంగా ఉండే అంతరిక్షంలో మనుగడకు ఇస్రో వినూత్న విధానాన్ని పాటించనుంది. 

అంతరిక్ష కేంద్రం

క్యాబినెట్ భేటీలో 2035 నాటికల్లా భారత అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ తలపెట్టిన మొదటి మానవసహితయాత్ర గగన్‌యాన్‌ను 2025 లో ప్రయోగించనుంది. ఈ ప్రయోగాలతో స్పేస్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలవనుంది.