లిమా(పెరూ): ప్రపంచ అథ్లెటిక్స్ అండర్ చాంపియన్‌షిప్‌లో 4x400 మిక్స్‌డ్ రిలే విభాగంలో భారత అథ్లెట్ల బృందం ఫైనల్‌కు అర్హత సాధించింది. జై కుమార్, నీరూ పాఠక్, రిహాన్ చౌదరి, సండ్రమోల్ సబుతో కూడిన భారత బృందం 4x400 మీ ఈవెంట్‌ను 3 నిమిషాల 22.54 సెకన్లలో పూర్తి చేసి హీట్స్‌లో రెండు.. ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియా బృందం (3 నిమిషాల 21.10 సెకన్లు), పొలండ్ బృందం (3 నిమిషాల 21.92 సెకన్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచారు.