calender_icon.png 2 November, 2024 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమలకే భారతీయుల మద్దతు

02-11-2024 12:33:42 AM

  1. అగ్రరాజ్యంలో బలంగా అమెరికన్ ఇండియన్లు
  2. 26 లక్షల మంది భారతీయ ఓటర్లు
  3. ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం

వాషింగ్టన్, నవంబర్ 1: అగ్రరాజ్యం అమెరికాలో మరికొద్ది రోజుల్లో ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతుండటంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయి.

ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్ల మద్దతు ఎవరికి అనే అం శం చర్చనీయాంశంగా మారింది. దీంతో పలు సర్వే సంస్థలు ఇండియన్ అమెరికన్ల నాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కార్నేగి గ్రూప్ సంస్థ కొద్ది  అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

60 శాతం కమల వైపే

ఎప్పటిలాగే అత్యధిక మంది ఇండియన్ అమెరికన్ల మద్దతు డెమోక్రటిక్ పార్టీకే ఉంది. ఇదే సమయంలో రిపబ్లికన్ పార్టీని సపోర్ట్ చేస్తున్న భారతీయ అమెరికన్ల సంఖ్య కూడా పెరిగిందని సర్వేలో వెల్లడైంది. ప్రతి 10 మంది భారతీయ అమెరికన్లలో ఆరుగురు కమల హ్యారిస్‌కు మద్దతు తెలుపగా, ప్రతి ముగ్గురలో ఒకరు డొనాల్డ్ ట్రంప్‌కు సపోర్ట్ చేశారట.

ఈసారి ఎన్నికల్లో జెండర్ అంశం కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇండియన్ అమెరికనల్లోని మహిళల్లో 67 శాతం కమలా హ్యారిస్ వైపు నిల్చుంటే.. కేవలం 53 మంది పురుషులు మాత్రమే ఆమెకు ఓటు వేసు వేసేందుకు నిర్ణయించుకున్నారట. అలాగే డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇస్తున్న భారతీయ మహిళల సంఖ్య 22 శాతం ఉంటే పురుషుల సంఖ్య 39శాతంగా ఉన్నట్లు సర్వే ద్వారా బయటపడింది.

భారత వారసత్వ అంశం ప్రతిసారి ఒకే విధంగా ప్రభావం చూపలేదని ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. భారత మూలా లు కలిగిన రిపబ్లికన్ నేతలు నిక్కీ హేళీ, వివేక్ రామస్వామి, ఉషా వాన్స్‌లు భారతీయ మూలాలు కలిగి ఉన్నప్పటికీ వారికి చెప్పుకోదగ్గ మద్దతు ఇండియన్ కమ్యూనిటీ నుంచి లభించలేదని ఇందులో వెల్లడైంది. 

బలంగా భారతీయ కమ్యూనిటీ

అమెరికాలో భారతీయల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2010-20 మధ్య అమెరికాలో ఇండియన్ అమెరికన్ల సంఖ్య ఏకంగా 50శాతం పెరిగింది. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 5.2 మిలియన్ల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. ఇందులో 3.9 మిలియన్ల మంది వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ. సుమారు 2.6 మిలియన్ల మంది భారతీయులు అమెరికాలో ఓటు హక్కు కలిగి ఉన్నారు.

వీళ్లంతా ఏకపక్షంగా ఓట్లు వేస్తే ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. గెలుపోటములను నిర్ణ యించే స్థాయిలో ఇండియన్ అమెరికన్ల ఓటర్ల సంఖ్య ఉన్నందున అమెరికాలోని రెండు ప్రధాన పార్టీలు మన వాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే రిపబ్లికన్ పార్టీ గత కొన్నేళ్లుగా తన పార్టీ పాలసీల్లో కూడా మార్పులు చేస్తూ వస్తోంది.