18-04-2025 01:10:28 AM
ఇమ్మిగ్రేషన్ అధికారులపై దావా వేసిన చిన్మయ్ డియోర్
న్యూయార్క్, ఏప్రిల్ 17: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానంలో అనుసరిస్తున్న విధానాలతో విదేశీ విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. క్యాంపస్ ఆక్టివిజమ్ పేరుతో విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ట్రంప్ ప్రభుత్వం. భారతీయ విద్యార్థిని ట్రంప్ పరిపాలనపై కోర్టును ఆశ్రయించారు.
విషయంలోకి వెళితే.. వేన్‌స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న భారత్‌కు చెందిన చిన్మయ్ డి యోర్, చైనాకు చెందిన మరో ఇద్దరు, నేపాల్‌కు చెందిన మరొకకు హోం ల్యాండ్ సెక్యూరిటీ ఇమ్మిగ్రేషన్ అధికారులపై కోర్టులో దావా వేశారు. స్టూడెంట్ అండ్ ఎక్ఛ్సేంచ్ విటిజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సెవిస్)లో ఎటువంటి నోటీసులు లేకుండానే చట్ట విరుద్ధంగా వీసాలను రద్దు చేయడాన్ని తప్పుబడుతూ పిటిషన్ దాఖలు చేశారు.