పటాన్‌చెరు, నవంబర్ 15: వైద్య విద్యను అభ్యసించేందుకు ఫిలిప్పీన్స్ వెళ్లిన విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని ఇంద్రేశం గ్రామ పం చాయతీ పరిధిలో నివాసముంటున్న చింత అమృత్‌రావు కుమార్తి చింత స్నిగ్ధ (17) ఫిలిప్పిన్స్‌లోని మనీలాలో పర్‌ఫెక్చువల్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ రెండో ఏడాది చదువుతోందన్నారు. కాగా శుక్రవారం ఉద యం స్నిగ్ధ ఉరేసుకొని చనిపోయినట్లు తోటి విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పుట్టిన రోజునే తమ కూతురు చనిపోవడంతో సిగ్ధ తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. తమ కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా మృతురాలి తండ్రి అమృత్‌రావు విద్యుత్ శాఖలో డీఈగా పని చేస్తున్నారు.