calender_icon.png 24 October, 2024 | 12:43 PM

Breaking News

అద్భుత ప్రగతిమార్గంలో భారతీయ రైల్వే

16-10-2024 12:00:00 AM

చలాది పూర్ణచంద్ర రావు :

ఆసియాలో అతి పెద్దది, ప్రపంచంలోనే అమెరికా తరువాత రెండవ పెద్దదైన భారతీయ రైల్వే  ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దశాబ్ద కాలంగా ఆధునిక, అభివృద్ధి కార్యక్రమాలతో కొత్త పుంతలు తొక్కుతోంది. నిత్యం 2.5 కోట్లమంది ప్రయణీకులను 13 వేల రైళ్ళ ద్వారా వారి వారి గమ్య స్థానాలకు చేరవేస్తున్నది.

రైల్వే శాఖలో పనిచేస్తున్న 10 లక్షల 20వేల మందికి పైగా సిబ్బంది 2023-24 ఆర్థిక సంవత్సరం రికార్డ్ స్థాయిలో 2లక్షల 56 వేల కోట్ల ఆదాయం సమకూర్చా రు. ఇంతేకాక మరో 8వేల గూడ్స్‌ల ద్వారా సరకులను చేరవేసి1,64,281 కోట్లను అర్జించటం జరిగింది. ఇంత భారీ స్థాయిలో ప్రయాణీకు లు, సరకులను చేరవేస్తున్న ఈ వ్యవస్థలో ప్రధాని నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన ప్రమాదాలు, మరణాల సంఖ్య పదేళ్ల కంటే సగానికి తగ్గిపోయింది.

స్వాతంత్య్రానంతరం అనేక దశాబ్దాల పాటు రైల్వేవ్యవస్థలో ఎలాంటి చెప్పుకోదగిన మార్పు లేదు. అయితే  మోదీ ప్రధానిగా ఎన్నికైన తరువాత రైల్వేశాఖ ఆధునికత వైపు దృష్టి కేంద్ర కరించారు. పెట్టుబడులను పది రెట్లు పెంచి, రైల్వేలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టారు. ఫలితంగా భారతీయ రైల్వేల రూపురేఖలే మారిపోయాయి. గత పదేళ్లలో 31,180 కిలోమీటర్ల కొత్త  రైల్వేలైన్లు ఏర్పాటు చేశారు.

గత పదేళ్లలోనే 40 వేల కిలోమీటర్లు విద్యుదీకరణ చేప ట్టి ఇప్పటికి 98.9 శాతం పూర్తి చేయడం జరిగింది. అలాగే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వందే భారత్, అమృత్ భారత్ రైళ్లకు తోడు వందే భారత్ మెట్రో రైళ్ల ట్రయల్స్ కూడా కొనసాగుతున్నాయి. కశ్మీర్ రైల్వే నెట్‌వర్క్ పనులు ఒక సొరంగ పనులు మినహా మిగిలిన ట్రాక్ లైన్ పూర్తి అయింది.

దేశవ్యాప్తంగా 1,326 స్టేషన్ల పునర్నిర్మాణ, ఆధునీకరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. కవచ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని  అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా వేగంగా అమలు  అమలుచేయ ట గొప్ప ముందంజగా పేర్కొనాలి.రైలు డ్రైవర్ ఎప్పుడైనా సిగ్నల్ జంప్ చేస్తే ఇది అత్యవసర హెచ్చరికను పంపిస్తుంది. పొగమంచు ఉన్నప్పుడు సరిగా కనిపించకపోయినా ఈ వ్యవస్థ పని చేస్తుంది.

ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు గుర్తించబడితే, ఎస్‌ఓఎస్ కమాండ్ రెండింటికీ స్టేషనరీ కవచ్ ద్వారా ఎస్‌ఓఎస్‌ను పంపిస్తుంది.  ఇప్పటికే  ప్రవేశపెట్టినవందేభారత్ రైళ్లను నడుపు తున్న  ప్రాంతాల్లో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. 2047 నాటికి భారత దేశం నిర్దేశించు కున్న వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు దక్షిణ భారత్ రాష్ట్రాలు కీలకం.

కారణం దక్షిణ భారతదేశంలో అపారమైన ప్రతిభ, వనరులు, అవకాశాలకు కొదవలేదని చెప్పాల్సిన పనిలేదు, అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సహా మొత్తం దక్షిణ భారత దేశ అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. గడచిన దశాబ్దంలో రైల్వే పెంచు కున్న హైస్పీడ్, అధునాతన భద్రతా ప్రమాణా లు, ప్రపంచ స్థాయి సేవలకు పోటీగా నిలిచిన వందే భారత్ రైలు ఒక గొప్ప చిహ్నంగా మారిందని చెప్పాలి.  

ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో గంటకు 180 కి. మీ వేగంతో పరుగెత్తే వందేభారత్  రైలు 2019 ఫిబ్రవరి 15న  తొలిసారి గా న్యూఢిలీ,్ల- వారణాసి మధ్య నడపటంతో మొదలైంది. ఈ రైళ్లకు పెరుగుతున్న ప్రజాదరణ, డిమాండ్‌తో వీటి సంఖ్యను పెంచడం జరిగిం ది. ఇటీవల ప్రధాని ఇటీవల ప్రారంభించిన మూడు వందే భారత్ రైళ్లతో కలిపి 54కు చేరుకుంది.

రానున్న రోజుల్లో  సౌకర్యవంతంగా,   వెళ్లే వందేభారత్ రైళ్లు విరివిగా ప్రవేశ పెడితే విమాన ప్రయాణం కంటే రైలు ప్రయా ణం మేలు అనే రోజు త్వరలో రానుంది . అదే కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం కూడా!