calender_icon.png 19 November, 2024 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ బ్యాంకింగ్ సేవలతో నెలకొన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

10-11-2024 12:00:00 AM

దేశీయులకు విదేశీ బ్యాంకింగ్ సేవల్ని అందించడం, విదేశీ మారక వ్యాపారం లక్ష్యంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ను (ఐవోబీ) పలు రంగా ల్లో నిపుణుడైన ఎం చిదంబరం చెట్టయార్ 1937లో నెలకొల్పారు. ఏకకా లంలో భారత్‌లోనూ, విదేశాల్లో శాఖల్ని తెరవడం ఐవోబీ ప్రత్యేకత. చెన్నైలోని కరైకూడి, బర్మా  (ఇప్పటి మయన్మార్)లోని రంగూన్‌లో ఒకేసారి తొలిశాఖల్ని ఈ బ్యాంక్ ప్రారంభించింది. 

తదుపరి మలేషియాలోని పెనాంగ్‌లో శాఖని తెరిచింది. అటు తర్వాత సింగపూర్, హాంకాంగ్, కొలంబో తదితర విదేశీ నగరాల్లోకి అడుగుపెట్టింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రంగూన్, పెనాంగ్ శాఖల్ని కోల్పోయింది. 1960 దశకంలో పలు చిన్న ప్రైవేటు బ్యాంక్‌ల్ని టేకోవర్ చేయడం ద్వారా ఐవోబీ మరింత విస్తరించింది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఐఓబీకి భారత్‌లో 38 శాఖలు, విదేశా ల్లో 7 శాఖలు ఉన్నాయి. 1969లో కేంద్ర ప్రభు త్వం జాతీయకరణ చేసేనాటికి ఐవోబీ దేశంలో 195 శాఖలతో విస్తరించింది. జాతీయకరణ తర్వాత ఇతర ప్రభుత్వ బ్యాంక్‌ల తరహాలోనే దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో శాఖల ఏర్పాటుపై దృష్టినిలిపింది.

క్రమేపీ తదుపరికాలంలో దక్షిణ కొరియా, హాంకాంగ్‌ల్లో ఐఓబీ శాఖల్ని ఏర్పాటుచేసింది. కొలంబోలో విదేశీ కరెన్సీ బ్యాంకింగ్ యూనిట్ నెలకొల్పింది.  ప్రస్తుతం ఐవోబీకి సింగపూర్, హాంకాంగ్, థాయ్‌లాండ్, శ్రీలంకల్లో శాఖలున్నాయి. 

రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువ

ఆస్తుల రీత్యా పీఎస్‌యూ బ్యాంక్‌ల్లోకెల్లా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 9వ స్థానంలో ఉన్నప్పటికీ, మార్కెట్ విలువలో నాల్గవ స్థానాన్ని ఆక్రమిస్తున్నది. స్టాక్ మార్కెట్‌లో ట్రేడయ్యే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1,00,390 కోట్లు. గడిచిన మూడేండ్లలో ఈ షేరు 148 శాతం పెరిగింది.

3,236 శాఖలు.. రూ.3.52 లక్షల కోట్ల ఆస్తులు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 2024 మార్చినాటికి 3,236 శాఖలు ఉన్నాయి.3,506 ఏటీఎంలను నిర్వహిస్తున్నది. 21,475 మంది ఉద్యోగులు ఉన్నా రు ఈ బ్యాంక్ ఆస్తుల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ. 3.52 లక్షల కోట్లు.  ఈ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 96.38 శాతం వాటా ఉన్నది. ఈ  బ్యాంక్‌కు ప్రస్తు తం శ్రీనివాసన్ శ్రీధరన్ నాన్ చైర్మన్‌గా, అజయ్‌కుమార్ శ్రీవాస్తవ ఎండీ, సీఈవోగా  వ్యవహరిస్తున్నారు.