వాషింగ్టన్ (అమెరికా), ఆగస్టు 31: అమెరికాలోని టెక్సాస్ నగరం హ్యూ స్టన్‌లో ఓ భారత సంతతికి చెందని వ్యక్తి జరిపిన కాల్పుల్లో నేపాల్‌కు చెందిన 21 ఏళ్ల యువతి మృతిచెందింది. కాల్పులు జరిపిన వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో భారత సంతతి వ్యక్తి బాబీ సిన్ షా(25) నేపాల్‌కు చెందిన యువతి మునా పాండే పై శనివారం కాల్పులు జరిపాడు. బాబీ సిన్ షా ఆమె ప్లాట్‌లో దొంగతనానికి వెళ్లిన సమయంలో ఆమెపై కాల్పులకు తెగబడినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మునా పాండే చనిపోయింది. ప్రస్తుతం నిందితుడిని అమెరి కా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా మునా పాండే అమెరికా లోని కమ్యూనిటీ కాలేజీలో చదువుతోంది. ఆమె మరణ వార్త విని కుటుం బ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మునా పాండే తల్లి మాట్లాడు తూ.. మునా పాండే నాకు ఒక్కగానొక్క కూతురు. ప్రతిరోజు నాకు ఫోన్ చేసేది. ఒక్కసారిగా ఆమె ఫోన్ రాకపోవడంతో స్నేహితులకు ఫోన్ చేయగా.. మునా చనిపోయిందని తెలిపారు. ఏం చేయాలో తెలియడం లేదు. మా కూతురి మృతదేహాన్ని మాకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.